ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళలకు ఏటా పసుపు కుంకుమ ఇస్తాం : డొక్కా - ప్రత్తిపాడు నియోజకవర్గం

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ విస్రృత ప్రచారం నిర్వహించారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టి మహిళల్లో ఆర్ధిక పరిపుష్టి పెంచేలా చేస్తామని హామీ ఇచ్చారు.

తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ విస్రృత ప్రచారం

By

Published : Apr 1, 2019, 9:00 AM IST

ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ విస్రృత ప్రచారం
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ విస్రృత ప్రచారం నిర్వహించారు. కాకుమాను, బికెపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టి మహిళల్లో ఆర్ధిక పరిపుష్టి పెంచేలా చేస్తామని హామీఇచ్చారు.

గత ఐదేళ్లలో రాష్ట్రంలోని గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయని చెప్పారు. తెదేపాకు అవకాశం కల్పిస్తే చంద్రబాబు నాయకత్వంలో మరింత అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలకు ప్రజాసమస్యలు, మహిళల సమస్యల పట్ల అవగాహన లేదన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ ను, ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుపై నాకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details