ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరోగ్యం సరిగా లేక ఇల్లు వదిలి వెళ్లిపోయాడు! - గుంటూరులో తాజాగా మిస్సింగ్ కేసు

ఆరోగ్యం సరిగా లేని ఓ వ్యక్తి ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడని పట్టాభిపురం ఎస్సై మహిత తెలిపారు. ఆసుపత్రికి వెళ్లడం ఇష్టం లేక అతను ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు ఫిర్యాదు లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

missing
ఆరోగ్యం సరిగా లేక ఇల్లు వదిలి వెళ్లిపోయాడు

By

Published : Oct 21, 2020, 5:54 PM IST

ఆరోగ్య పరిస్థితి సరిగా లేని ఓ వ్యక్తి ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడని పట్టాభిపురం ఎస్సై మహిత తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ 1వ లైన్ కి చెందిన తారిగోపుల.వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అనారోగ్య కారణాలతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని అన్నారు . కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్తామనగా...అది ఇష్టం లేని అతను ఎవరికి తెలపకుండా వెళ్లిపోయాడని పేర్కొన్నారు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details