ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజస్వామ్యాన్ని అణచివేయాలనుకోవడం సరికాదు' - మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గృహనిర్బంధం

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న వారిని గృహ నిర్బంధం చేయటాన్ని ఖండిస్తున్నామని మాజీ మంత్రి అన్నారు.

పత్తిపాటి పుల్లారావు
పత్తిపాటి పుల్లారావు

By

Published : Jan 7, 2020, 12:16 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న తెదేపా నేతలను గృహ నిర్బంధం చేయటాన్ని ఖండిస్తున్నామని ప్రత్తిపాటి అన్నారు. ఉద్యమాన్ని ఎంత అణచివేస్తే అంతగా ఉద్దృతం చేస్తామని హెచ్చరించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులే ప్రభుత్వానికి మరణ శాసనం రాస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఖరి వల్ల మృతి చెందిన ఆరుగురు రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పడు జగన్​ రాష్ట్రమంతా పాదయాత్ర చేసినా తాము అడ్డుకోలేదని గుర్తు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజస్వామ్యాన్ని అణచివేయాలని చూడటం తగదని హితువు పలికారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details