ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన ప్రవీణ్‌ చక్రవర్తి కస్టడీ.. 3 రోజులు విచారణ చేసిన సీఐడీ - పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి కస్టడీ ముగింపు వార్తలు

మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన కాకినాడకు చెందిన పాస్టర్‌ ఎస్‌. ప్రవీణ్‌ చక్రవర్తికి.. 3 రోజుల పోలీసు కస్టడీ శనివారం ముగిసింది. ఆయన్ను గుంటూరు ప్రాంతీయ సీఐడీ కార్యాలయం అధికారులు శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు.

ముగిసిన ప్రవీణ్‌ చక్రవర్తి కస్టడీ.. 3 రోజులు విచారించిన సీఐడీ
ముగిసిన ప్రవీణ్‌ చక్రవర్తి కస్టడీ.. 3 రోజులు విచారించిన సీఐడీ

By

Published : Jan 24, 2021, 10:17 AM IST

పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి మూడు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో కోర్టు అనుమతితో మూడు రోజులపాటు విచారణ జరిపారు. ప్రవీణ్‌కు బెయిల్‌ మంజూరు కాలేదని, ఈనెల 25న వాదనలున్నాయని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. జ్యుడీషియల్‌ కస్టడీ నుంచి 3 రోజుల విచారణకు తీసుకున్న పోలీసులు బుధవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు వివిధ అంశాలపై ఆరా తీశారు.

తానే దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశానని, అనేక పల్లెలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలతోపాటు పలు కోణాల్లో ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. ఇంకా కొంత సమాచారం అవసరమని, తిరిగి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సీఐడీ పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం మళ్లీ కస్టడీకి తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ప్రవీణ్‌ కుటుంబీకులు, ఆయన సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో కొందరికి సమన్లు ఇచ్చి సీఐడీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తున్నారు. శనివారం మరి కొందరిని విచారణ చేసి వారినుంచి వ్యక్తిగత వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details