బుళ్లు రవి కుమార్, రామారావులు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 15వ వార్డులో గురువారం రాత్రి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ పార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో ఇద్దరూ పాల్గొన్నారు. దీనిపై గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీకి ఫిర్యాదు అందటంతో క్రమశిక్షణా చర్యల కింద వీఆర్‌కు పంపుతూ శుక్రవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు.
PK birthday: పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకల్లో కానిస్టేబుళ్లు..కానీ - గుంటూరు గ్రామీణ ఎస్పీ
ఆ కానిస్టేబుళ్లు ఇద్దరూ జనసేన అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు క్రమశిక్షణా చర్యల కింద వీఆర్‌కు వెళ్లాలని ఎస్పీ ఆదేశించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో చోటు చేసుకుంది.
పీకే జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు..వీఆర్ కు పోయారు...
హెడ్ కానిస్టేబుళ్లు బుళ్లు రవి కుమార్, రామారావులు వీఆర్‌కు పంపుతున్న విషయాన్ని పట్టణ సీఐ శోభన్‌బాబు ధ్రువీకరించారు.
ఇదీ చదవండి: RAPE: బెంగళూరులో రాష్ట్రానికి చెందిన ఐటీ ఉద్యోగినిపై నైజీరియన్ల అత్యాచారం