లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ పరిటాల యువసేన అధ్యక్షుడు దండమూడి ధరణి కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు రేపల్లె పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పరిటాల యువసేన 12గంటలు నిరాహారదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ధాన్యం, మిర్చి, అరటి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణ కోసం పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, పాత్రికేయులకు రక్షణ కిట్లు అందించాలని కోరారు. అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలన్నారు.
'పేదలకు రూ.5 వేల ఆర్థిక సాయం అందించాలి' - పేదల కోసం తెదేపా నిరసన
లాక్డౌన్ వల్ల కష్టాలు పడుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ రేపల్లెలోని పరిటాల యువసేన 12గంటల నిరాహార దీక్షను చేపట్టారు. అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
paritala yuvasena protest in repalle, demanding government should help to poor in lockdown