అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెదేపా యువనేత పరిటాల శ్రీరామ్ సూచించారు. మొండిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మెడలు వంచాలని అన్నారు. రాజధాని రైతులు చేస్తోన్న దీక్షకు మద్దతుగా ఆయన మందడం, వెలగపూడి శిబిరాలను సందర్శించారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు వెళ్తూ అసెంబ్లీలో తమకు అనుగుణంగా బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజా ఉద్యమం ముందు ఎవరైనా తలదించాల్సిందేనని పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. వెలగపూడిలో మృతి చెందిన రైతు అప్పారావు భౌతికకాయానికి ఆయన నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
'ప్రజా ఉద్యమం ముందు ఎవరైనా తలదించాల్సిందే'
ప్రజా ఉద్యమం ముందు ఎవరైనా తల దించాల్సిందేనని తెదేపా నేత పరిటాల శ్రీరామ్ అన్నారు. రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.
paritala-sriram fire on ycp government