ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిషత్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా... గుంటూరులో ఎన్నికల సామగ్రి పంపిణీ - guntur parishat elections latest news

పరిషత్ ఎన్నికలు నిర్వహించవచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో... గుంటూరు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు జోరందుకున్నాయి. సామగ్రి పంపిణీ చకచకా జరిగింది.

parishat election material distribution
పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు

By

Published : Apr 7, 2021, 6:12 PM IST

Updated : Apr 7, 2021, 10:30 PM IST

గుంటూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో.. ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణి చేశారు. హైకోర్టు మొదట స్టే ఇవ్వడంతో ఒకింత సందిగ్ధంలో పడ్డారు. చివరికి.. డివిజన్ బెంచ్ ఉత్తర్వులతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.

కోర్టు అనుమతి ఇవ్వగానే సిబ్బందికి అధికారులు విధుల కేటాయింపు, సామాగ్రి పంపిణీ మొదలుపెట్టారు. సామగ్రితో పాటు సిబ్బంది ఈరోజు రాత్రికి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఉద్యోగులకు రవాణా సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో...

పరిషత్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో... ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల్లో పోలింగ్​కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోర్టు తీర్పు వచ్చేవరకు చాలా మంది ఎన్నికల సిబ్బంది.. కేటాయించిన మండలాలకు వెళ్లలేదు. తీర్పు వెలువడిన అనంతరం.. హడావుడిగా మండల కేంద్రాలకు చేరుకున్నారు. మరికొంత మంది సిబ్బంది రాకపోవడంతో.. అధికారులు ఫోన్లు చేసి మరీ పిలిపించాల్సి వచ్చింది.

ఇదీ చదవండి:

రేపే పరిషత్ ఎన్నికలు: ఇప్పటివరకు ఏం జరిగింది..?

Last Updated : Apr 7, 2021, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details