ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రధానోపాధ్యాయుడిని బదిలీ చేయండి.. లేదా పిల్లలకు టీసీలు ఇవ్వండి' - కొమ్మూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల వార్తలు

మద్యం సేవించి పాఠశాలకు వచ్చే ప్రధానోపాధ్యాయుడు మాకొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేసిన ఘటన.. గుంటూరు జిల్లా కొమ్మూరు ప్రాథమిక పాఠశాల వద్ద జరిగింది. ఆయన విద్యార్థులతో సిగరెట్లు తెప్పిస్తున్నాడని.. అతన్ని చూసి పిల్లలు భయపడుతున్నారని తెలిపారు. అతను గనుక పాఠశాలలో ఉంటే తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని కోరారు.

parents demands to head master transer in kommuru guntur distrcit
కొమ్మూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

By

Published : Jul 2, 2020, 10:16 AM IST

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజ్ కుమార్​ గత ఏడాది సస్పెండ్ అయ్యాడు. మద్యం సేవించి రావడం, విద్యార్థులతో మద్యం సీసాలు కడిగించడం, సిగరెట్లు తెప్పించడం వంటివి చేస్తున్నాడన్న ఆరోపణలతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కొల్లిపర మండలానికి ఆయన్ను డిప్యుటేషన్​పై పంపించారు. పాఠశాలలు వచ్చే నెలలో పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్ కుమార్​ను తిరిగి ఇదే పాఠశాలలో అధికారులు నియమించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేశారు. ఆ ప్రధానోపాధ్యాయుడు ఇక్కడే ఉండేట్లయితే తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని కోరారు. లేదా అతన్ని బదిలీ చేసి వేరే టీచర్​ని నియమించాలన్నారు. దీనిపై ఎంఈఓ కెనడితో మాట్లాడగా... తల్లిదండ్రుల ఆందోళన విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్ళామని.. రాజ్​కుమార్​ను కొల్లిపర మండలానికి డిప్యుటేషన్​పై పంపించాలని ఆదేశించినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details