ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"ఉచితమని ప్రకటించి.. రూ.వేలల్లో ఫీజులు దండుకుంటున్నారు"

By

Published : May 16, 2022, 11:22 AM IST

Parents Protest: గుంటూరు జిల్లాలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల పేరిట విద్యార్థులను, క్రీడాకారులను మోసం చేస్తున్నారని వివిధ రాజకీయపార్టీల నేతలు మండిపడ్డారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఉచితంగా నిర్వహిస్తున్నామని ప్రకటించి నేడు వేలల్లో వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Parents Protest
వేసవి క్రీడా శిబిరాల ఫీజులు భారీగా పెంచారంటూ ఆందోళన

Parents Protest: గుంటూరులో వేసవి క్రీడా శిబిరాలు ఉచితంగా నిర్వహిస్తున్నామని ప్రకటించి.. విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు దండుకుంటున్నారంటూ.. బీఆర్‌ స్టేడియం వద్ద రాజకీయ నాయకులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వేలల్లో ఫీజులు పెంచి విద్యార్థులను క్రీడలకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. చెత్తమీద పన్ను వేసిన ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తక్షణమే ఫీజులు తగ్గించి పాత విధానంలో కట్టించుకోవాలని డిమాండ్ చేశారు.

వేసవి క్రీడా శిబిరాల ఫీజులు భారీగా పెంచారంటూ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details