ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.11 లక్షలు ఇచ్చాం.. ఇంకో రూ.3 లక్షల కోసం చంపేశారు! - గుంటూరు బ్లోసమ్స్ ఆస్పత్రి నిర్వాకం

వైద్యుల నిర్లక్ష్యమే తన కుమారుని మృతికి కారణమంటూ గుంటూరు కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

parents agitaion at guntur hospital
ఆస్పత్రి వద్ద నిరసన

By

Published : Dec 12, 2020, 1:37 PM IST

Updated : Dec 12, 2020, 1:46 PM IST

గుంటూరు కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు నెలల పసికందు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమంటూ తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని కోరారు.

పుట్టుకతోనే అనారోగ్య సమస్య ఎదురైతే సెప్టెంబరు 19న బాలుడిని చేర్పించామని.. ఇంతవరకూ చికిత్స కోసం 11 లక్షల రూపాయలు చెల్లించామని బాలుడి తండ్రి కాళేశ్వరరావు చెప్పారు. మరో 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని.. ఇవ్వకపోవడం వల్లే సరైన వైద్యం చేయకుండా వైద్యులు నిర్లక్ష్యం చేశారని కాళేశ్వరరావు వాపోయారు.

ఆస్పత్రి వద్ద నిరసన
Last Updated : Dec 12, 2020, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details