ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏఈఎల్​సీ అధ్యక్షుడిగా నన్నే కొనసాగిస్తూ హై కోర్టు ఉత్తర్వులిచ్చింది' - ఆంధ్రా ఎవాంజిలికల్ లూథరన్ చర్చి తాజా సమాచారం

గుంటూరులోని ఆంధ్రా ఎవాంజిలికల్ లూథరన్ చర్చి అధ్యక్షునిగా తననే కొనసాగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు పరదేశిబాబు తెలిపారు. ఈ విషయంపై ఏలూరు సీనియర్ సివిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసి... తనను అధ్యక్షునిగా కొనసాగేందుకు అనుమతించిందని వివరించారు.

Pardeshibabu
ఏఈఎల్.సీగా పరదేశిబాబును కొనసాగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు

By

Published : Jan 17, 2021, 11:33 AM IST

గుంటూరులోని ఆంధ్రా ఎవాంజిలికల్ లూథరన్ చర్చి అధ్యక్షునిగా తననే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పరదేశిబాబు తెలిపారు. చింతల ఏలియా ఎన్నిక చెల్లదని 15వ తేదిన హైకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. చింతల ఏలియా ఎన్నిక చెల్లదని 15వ తేదిన హైకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. 1840లో ఏర్పడిన ఈ సొసైటికి నాలుగేళ్లకు ఓసారి ఎన్నికలు జరుగుతాయి. 2017 ఎన్నికలు జరగ్గా... పరదేశిబాబు ప్యానల్ విజయం సాధించింది. ఈ ఏడాది మే 31 వరకూ పదవి కాలం ఉండగనే ఏలియా వర్గం ఎన్నికలు నిర్వహించుకుని తాము గెలిచినట్లు ప్రకటించుకుంది. కొద్ది రోజులుగా ఈ విషయమై రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది.

"వివాదంపై... ఇరువర్గాలు కోర్టుకు వెళ్లగా.. ఏలూరు కోర్టులో ఏలియా వర్గానికి అనుకూలంగా తీర్పు వెల్లడైంది. తాజాగా పరదేశిబాబుని అధ్యక్షునిగా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఏలూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సస్పెండ్ చేసింది. ఏలియా వర్గం వారు ఏఈఎల్.సి. కార్యాలయంలోనికి అడుగు పెట్టకుండా చూడాలని గుంటూరు జిల్లా పోలీసుల్ని ఆదేశించింది" అని పరదేశిబాబు తెలిపారు. వేల కోట్లు అక్రమాలు జరిగాయని అవతలి వర్గం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడించారు. అధ్యక్షునికి ఎలాంటి అధికారాలు ఉండవని... ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం 65ఏళ్లు దాటిన వారు పాస్టర్ గా ఉండేందుకు అనర్హులని... ఆ ప్రకారం వయసు దాటిన ఏలియా అధ్యక్షుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details