ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిందితులపై చర్యలు ఎప్పుడు... ?' - పంచుమర్తి అనురాధ తాజా వార్తలు

బాలికపై అత్యాచారం జరిపిన నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని తెదేపా మహిళా నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో అఘాయిత్యానికి బలైన బాలికకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

పంచుమర్తి అనురాధ

By

Published : Nov 2, 2019, 11:14 AM IST

అత్యాచార నిందితులపై చర్యలు తీసుకోవాలని తెదేపా మహిళా నేతల డిమాండ్​

గుంటూరు జిల్లా దాచేపల్లిలో అ త్యాచారానికి గురై పిడుగురాళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను తెదేపా మహిళా నేతలు పరామర్శించారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఏం చేయాలో తెలియక ప్రతిపక్ష నేత చంద్రబాబు వద్ద బాలిక తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారన్నారు. తెదేపా నేతలు స్పందించేవరకు అధికార పార్టీ స్పందించలేదని ఆరోపించారు. ఇప్పటివరకూ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.
నిందితుడికి శిక్ష పడాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నప్పటికీ.. ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. హోంమంత్రి సైతం నిందితుడిపై చర్యలు తీసుకోకుండా సమస్యను రాజీ చేసే ప్రయత్నం చేశారని అనురాధ విమర్శించారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని.. బాలిక వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ములక సత్యవాణి, ఆచంట సునీత తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details