పేదలకు ఇళ్ల స్థలాల మాటున అధికార పార్టీ భారీ కుంభకోణానికి పాల్పడుతోందని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. భూమి కొనుగోలులో రైతుకు సగం డబ్బే ఇచ్చి మిగిలింది వైకాపా నేతలు కాజేస్తున్నారని దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాల పేరుతో ఇంటింటికీ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. ఈ అంశంపై వైకాపా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
'పేదలకు ఇళ్ల స్థలాల మాటున భారీ కుంభకోణం'
పేదల ఇళ్ల స్థలాల మాటున జరిగిన భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. భూమి కొనుగోలులో రైతుకు సగం డబ్బే ఇచ్చి మిగిలింది వైకాపా నేతలు కాజేస్తున్నారని దుయ్యబట్టారు.
పేదలకు ఇళ్ల స్థలాల పై పంచుమర్తి అనురాధ
ఇళ్ల స్థలాల మాటున భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యేదాకా ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా చెలరేగుతోందని పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ఎల్జీ పాలిమర్స్ కేసు విచారణ ఈ నెల 16కి వాయిదా