ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీరాజ్ శాఖలోని.. వివిధ సంఘాల అధ్యక్షులు సమావేశం - మంగళగిరిలో పంచాయతీరాజ్ శాఖ వివిధ సంఘాల అధ్యక్షులు తాజా వార్తలు

మంగళగిరిలో పంచాయతీరాజ్ శాఖలోని వివిధ సంఘాల అధ్యక్షులు సమావేశమయ్యారు. గ్రామ సచివాలయాల్లో డ్రాయింగ్ డిస్​బర్స్‌మెంట్ అధికారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శుల నుంచి గ్రామ రెవెన్యూ అధికారికి బదలాయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

#Panchayati Raj associations presidents Meeting
సమావేశమైన పంచాయతీరాజ్ శాఖలోని వివిధ సంఘాల అధ్యక్షులు

By

Published : Mar 26, 2021, 5:48 PM IST

గ్రామ సచివాలయాల్లో డ్రాయింగ్ డిస్​బర్స్‌మెంట్ అధికారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శుల నుంచి గ్రామ రెవెన్యూ అధికారికి బదలాయించడంపై.. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. పంచాయతీరాజ్ శాఖలోని వివిధ సంఘాల అధ్యక్షులు మంగళగిరిలో సమావేశమయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి జగన్‌ను ఉన్నతాధికారులు తప్పుదోవ పట్టించేలా వ్యవహించారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలకు సత్వర పనులు చేసే కార్యదర్శులను కాదని వీఆర్వోలకు కీలకమైన బాధ్యతలను బదలాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగంలోని 70వ అధికరణను ఉల్లంఘించడమేనని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

andolana

ABOUT THE AUTHOR

...view details