తమపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని పంచాయితీ రాజ్ ఇంజినీర్ల ఐకాస ఉద్ఘాటించింది. ఈమేరకు గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. గతంలో జరిగిన ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పనుల మీద ఏసీబీ ఇచ్చిన లేఖను తక్షణం ఉపసంహరించుకోవాలని ఐకాస నాయకులు సంగీతరావు డిమాండ్ చేశారు. ఇంజినీర్లు మీద ఎలాంటి చర్యలు ఉండవని మంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు కోరారు.
మంత్రి మాట నిలబెట్టుకోవాలి: పంచాయితీ రాజ్ ఇంజినీర్ల ఐకాస - guntur collectorate news update
గుంటూరు కలెక్టరేట్ వద్ద పంచాయితీ రాజ్ ఇంజినీర్ల ఐకాస నిరసన చేపట్టింది. తమపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేసింది.
పంచాయితీ రాజ్ ఇంజినీర్ల జేఏసీ ఆందోళన