ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి - guntur polling arrangements recent news

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు గుంటూరు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. పోలింగ్ సిబ్బంది, జిల్లా అధికారులు.. మంగళవారం జరగబోయే ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.

tenali polling arrangements
గుంటూరు జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు

By

Published : Feb 8, 2021, 8:36 PM IST

గుంటూరు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు... అధికారులు, పోలింగ్ సిబ్బంది సమాయత్తమయ్యారు. తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో తొలి విడత ఎన్నికలను నిర్వహించనున్నారు. పంచాయతీల వారీగా పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. పోలింగ్ సిబ్బందికి ఆయా మండల కేంద్రాల్లో ఎన్నికల సామగ్రిని అందజేశారు. మెుత్తం 61 రకాల సామగ్రిని అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.

బ్యాలెట్ బాక్సులతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సరంజామాను ప్రత్యేకంగా ప్యాకింగ్ చేశారు. కానీ బ్యాలెట్ బాక్సులు చాలా కాలం నుంచి అలాగే ఉంచటంతో.. వాటిని తెరవటానికి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. బాక్సులు శుభ్రం చేయకుండానే సిబ్బందికి అందశారు. సిబ్బంది వాటిని సరిచూసుకొని, ఎన్నికల విధులకు బయలుదేరుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ పత్రాన్ని గోడలకు అతికించటం, పోలింగ్ కేంద్రం చుట్టూ తెర ఏర్పాటు చేయటం, అవసరమైన పత్రాలన్నీ వరుస క్రమంలో అమర్చుకోవటం వంటివి నేటి రాత్రికే పూర్తి చేయాల్సి ఉంటుంది.

తెనాలి డివిజన్​లో 270 పంచాయతీలకు, 2105 వార్డులకు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. రేపటి ఉదయానికి పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉంటారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

సంయుక్త కలెక్టర్ సూచనలు

గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు.. అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. తొలివిడత ఎన్నికలు జరుగుతున్న తెనాలి రెవెన్యూ డివిజన్​లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సిబ్బంది అంతా నిబంధనల ప్రకారం పని చేయాలని స్పష్టం చేశారు. విధులకు ఎవరూ గైర్హాజరు కాకూడదని హెచ్చరించారు. అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బారికేట్లు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని... అన్ని కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండేందుకు ప్రత్యేక అధికారులు, పోలీస్ బలగాలను సిద్ధం చేశామని వివరించారు.

3500 మంది సిబ్బందితో...

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేసేందుకు... పోలీసు శాఖ ఏర్పాట్లు చేసిందని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. తొలి విడత ఎన్నికల కోసం 3 వేల 500 మంది సిబ్బందిని నియమించినట్లు వివరించారు. 67 షాడో పార్టీలు అన్ని ప్రాంతాల్లో గస్తీ కాస్తాయనీ.. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

దిల్లీ బయలుదేరిన జనసేన అధినేత పవన్

ABOUT THE AUTHOR

...view details