ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్లె పోరులో.. ఓటరోత్సాహం

పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు సమస్యాత్మకమైన పల్నాడులో ప్రజలు నిర్భయంగా ఓటేశారు. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సమస్యాత్మక గ్రామాల్లోనూ 85 శాతంపైగా పోలింగ్‌ నమోదుకావడం చెప్పుకోవాల్సిన విషయం. మొత్తం మీద మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన గురజాల డివిజన్‌లోని గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది.

panchayathi elections 2021
పల్లె పోరులో.. ఓటరోత్సాహం

By

Published : Feb 18, 2021, 8:21 AM IST

గుంటూరు సమస్యాత్మక ప్రాంతమైన పల్నాడులో ప్రజలు నిర్భయంగా ఓటేశారు. బుధవారం ఉదయం 6.30 గంటలకు భారీఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఆ తరువాత కొంత సేపటికే ఓటర్లు బారులుదీరి కనిపించారు. అత్యంత సమస్యాత్మక గ్రామాల్లోనూ 85 శాతంపైగా పోలింగ్‌ నమోదుకావడం చెప్పుకోవాల్సిన విషయం. మొత్తం మీద మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన గురజాల డివిజన్‌లోని గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. జిల్లాలో తొలివిడత ఎన్నికలు జరిగిన తెనాలి డివిజన్‌లో 83.04 శాతం, రెండో విడత నరసరావుపేటలో 85.15 శాతం పోలింగ్‌ నమోదు కాగా, మూడో విడత గురజాల డివిజన్‌లో 84.80 శాతం పోలింగ్‌ నమోదైంది. ఒక్క ఓటు కూడా విజయావకాశాలపై ప్రభావం చూపుతుండటంతో గ్రామాల్లో 90 ఏళ్లు పైబడిన వృద్ధులను సైతం వాహనాల్లో తీసుకొచ్చి దగ్గరుండి ఓటు వేయించారు. ఓటరు జాబితాను దగ్గర ఉంచుకుని ఓటింగ్‌ వచ్చిన వారి వివరాలు నమోదుచేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఓటింగ్‌కు రాని వారి వివరాలు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లి కేంద్రానికి తీసుకువచ్చారు. గ్రామాల్లో ఓటుహక్కు ఉన్నప్పటికీ వివిధ వ్యాపారాలు, వృత్తుల రీత్యా వివిధ పట్టణాలు, నగరాల్లో ఉన్నవారు సైతం గ్రామానికి చేరుకొని ఓట్లు వేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు తమకు కచ్చితంగా ఓటు వేస్తారని నమ్మకమున్న ఓటర్లకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి తీసుకొచ్చారు.

నువ్వానేనా అన్నట్లు పోటీ..

గురజాల డివిజన్‌లో మొత్తం 134 పంచాయతీలు ఉండగా 98 ఏకగ్రీవమయ్యాయి. 36 పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులతోపాటు 3 గ్రామాల్లో కేవలం వార్డు సభ్యుల స్థానాలకు కలిపి 39 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరం, గురజాల, రెంటచింతల, దుర్గి మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మాచర్ల నియోజకవర్గంలో 3 గ్రామాలు, గురజాల నియోజకవర్గంలో 36 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలు పోగా ఎన్నికలు జరిగిన గ్రామాల్లో నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. వార్డు సభ్యుల స్థానాలు, సర్పంచి పదవులకు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి? ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎవరి ఓట్లు ఏ వర్గానికి వేశారు? తదితర అంశాలపై చర్చించారు.

ఇదీ చదవండి

పల్లె తీర్పు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details