GOPALA KRISHNA DWIVEDI : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. సెలవు ముగించుకొని, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న బుడితి రాజశేఖర్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. గోపాలకృష్ణ ద్వివేదిని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగానూ, రైతు భరోసా కేంద్రాల ప్రత్యేక కమిషనర్‌గానూ నియమించింది.
పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ.. - బుడితి రాజశేఖర్
GOPALA KRISHNA DWIVEDI : పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని ప్రభుత్వం బదిలీ చేసింది. వ్యవసాయం, సహకార, పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శిగా ద్వివేదిని నియమించింది.
GOPALA KRISHNA DWIVEDI
గోపాల కృష్ణ ద్వివేది పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్న గనులశాఖ ముఖ్య కార్యదర్శి పోస్టులోనూ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్)గా పని చేస్తున్న వై.మధుసూదన్‌రెడ్డి ఇప్పటి వరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాధ్యత నిర్వహిస్తున్నారు. ద్వివేదిని ఆ పోస్టులో నియమించడంతో.... అదనపు బాధ్యత నుంచి మధుసూదన్‌రెడ్డిని ప్రభుత్వం రిలీవ్ చేసింది.
ఇవీ చదవండి: