ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బ్లీచింగ్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలి' - అఖిలభారత పంచాయతి పరిషత్ అధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు

బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లలో అక్రమాలు వెలుగు చూడడంపై.. అఖిల భారత పంచాయతి పరిషత్ అధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

'బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ జరిపించాలి'
'బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ జరిపించాలి'

By

Published : May 19, 2020, 7:45 AM IST

బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ అధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన కార్యాలయ అధికారులకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

కరోనా వైరస్ నివారణలో భాగంగా పారిశుద్ధ్య చర్యల కోసం గుంటూరు జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బ్లీచింగ్ పౌడర్ సరఫరా అయింది. అయితే అందులో నాణ్యత లేకపోవటంపై మీడియాలో కథనాలు వచ్చాయని... ఇలాంటి చర్యలకు సరి కాదని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details