ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GANG ARREST: పంచలోహ విగ్రహాలు అమ్మబోయారు..అడ్డంగా దొరికారు - గుంటూరు జిల్లా నేర వార్తలు

GANG ARREST: పంచలోహ విగ్రహాల చోరీ ముఠా అరెస్టు
GANG ARREST: పంచలోహ విగ్రహాల చోరీ ముఠా అరెస్టు

By

Published : Oct 18, 2021, 2:12 PM IST

Updated : Oct 18, 2021, 5:15 PM IST

14:09 October 18

ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

పంచలోహ విగ్రహాలను(panchaloha statues) విక్రయించేందుకు యత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను గుంటూరు అరండల్​పేట పోలీసులు(guntur arandalpeta police) అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 లక్షలు విలువైన శివపార్వతుల విగ్రహాలను స్వాధీనం(Seize) చేసుకున్నారు.  

ఏం జరిగిందంటే... 

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కమ్మవారిపాలెం(prakasam district kammavaripalem) గ్రామానికి చెందిన సుందరరావు(sundararao)... గతేడాది నవంబరులో పొలం దున్నుతుండగా శివపార్వతుల పంచలోహ విగ్రహాలు(lord shiva, parvathi statues) బయటపడ్డాయి. వాటిని బంగారు విగ్రహాలుగా భావించి ఎవరికీ చెప్పకుండా తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల సుందరరావుకు ప్రమాదం(accident) జరగడంతో డబ్బు(money) అవసరమైంది. ఈ పరిణామాలతో సుందరరావు తన అన్నయ్య కుమారుడు రవికి పంచలోహ విగ్రహాల గురించి వివరించాడు. 

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. 

పెదనాన్న సూచనతో రవి... గుంటూరుకు చెందిన మరో నలుగురు వ్యక్తులతో కలిసి విగ్రహాలను(statues) విక్రయించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని గుంటూరు కొరిటెపాడు సెంటర్(guntur koritepadu center)​లో పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి.. రూ.10 లక్షలు విలువైన విగ్రహాలను స్వాధీనం(statues seize) చేసుకున్నారు. పురాతన వస్తువులు లభిస్తే ప్రభుత్వానికి అందించాలని, అలాకాకుండా స్వప్రయోజనాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు(leagal act) తీసుకుంటామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్(SP arif hafiz) హెచ్చరించారు.

ఇదీ చదవండి:

వరదలతో కేరళ అతలాకుతలం- రెడ్ అలర్ట్ జారీ

Last Updated : Oct 18, 2021, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details