గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో.. తమను వైకాపా నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెదేపా వార్డు సభ్యులు వాపోయారు. సర్పంచ్ గౌసియా బేగం, వార్డు సభ్యులు రాంబాబు.. ఈ మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉప సర్పంచ్ ఎన్నికలో మద్దతు తెలపాలంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. లేదంటే కేసుల్లో ఇరికిస్తామంటున్నారని ఆవేదన చెందారు.
వైకాపా నేతల బెదిరింపులతో.. ఉప సర్పంచ్ ఎన్నికకు అధికారులు సైతం ముందుకు రావడం లేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. పోలీసుల ద్వారా వార్డు సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తెదేపా మద్దతుదారు ఉప సర్పంచ్ కాకుండా వేదింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారితో పాటు మార్కెట్ యార్డు ఛైర్మన్ హనీఫ్ నుంచి తమకు రక్షణ కల్పించి.. గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నిక జరిపించాలని కోరారు.