గుంటూరులో పర్యటిస్తున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందాన్ని మోర్జంపాడుకు చెందిన వైకాపా బాధితులు కలిశారు. రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో వారిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. తమను అధికార పార్టీ నేతలు వేధిస్తున్న విషయాన్ని కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. తమ భూములను సాగు చేసుకోనివ్వడం లేదని వాపోయారు. వారిని కలవకుండా అంతకుముందు పోలీసులు అడ్డుకున్న విషయాన్ని వివరించారు.
'మిమ్మల్ని కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు'
జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందాన్ని కలవకుండా తమను పోలీసులు అడ్డుకుంటున్నారని మోర్జంపాడు గ్రామస్థులు ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని వాపోయారు.
ఎన్హెచ్ఆర్సీ బృందాన్ని కలిసిన పల్నాడు వైకాపా బాధితులు