ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలి' - పిడుగురాళ్ల వార్తలు

పల్నాడు జిల్లా సాధన సమితి పిడుగురాళ్ల పట్టణంలోని వల్లెల గార్డెన్​లో సమావేశం నిర్వహించింది. 800 ఏళ్ల చరిత్ర కలిగిన పల్నాడును జిల్లాగా ప్రకటించి దానికి గురజాలను కేంద్రంగా చేయాలని కోరింది.

palnadu jac demand for palnadu district
పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలి

By

Published : Jan 20, 2021, 6:51 PM IST

పల్నాడును జిల్లాగా ప్రకటించాలని పల్నాడు జిల్లా సాధన సమితి సభ్యులు కోరారు. దానికి గురజాలను కేంద్రంగా చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని వల్లెల గార్డెన్​లో సాధన కమిటీ జేఏసీ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గురజాలను కేంద్రంగా.. పల్నాడు జిల్లా ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసిరావాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details