గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కళ్లిఫలం గ్రామం తాటి బెల్లం తయారీకి ప్రసిద్ధి. గ్రామంలో అందరూ గీత కార్మికులే ఉండడంతో...తరతరాలుగా తాటి బెల్లం తయారీని జీవనాధారంగా నమ్ముకున్నారు. తాటిచెట్ల నుంచి తీసే కల్లుతో బెల్లం తయారుచేస్తుంటారు. ప్రకృతి సిద్ధంగా తయారుచేసే ఈ బెల్లానికి మంచి గిరాకీ ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి బెల్లాన్ని కొనుగోలు చేస్తుంటారు.
తయారీ ఇలా...
తాటిబెల్లం తయారీలో...ముందుగా సముద్రంలోని నత్త గుల్లలను సేకరిస్తారు. వాటిని కాల్చి సున్నంలా పొడి చేస్తారు. ఆ తెల్లటి సున్నాన్ని కల్లుకుండ లోపల భాగంలో పూతపూసి తాటిచెట్టుకు తగిలిస్తారు. కుండ లోపల పడిన కల్లు ఈ పొడి వలన పాకంలా మారుతుంది. ఈ పాకాన్ని కడాయిలో పోసి మరిగిస్తారు. 100 లీటర్ల పాకాన్ని రోజంగా మరిగిస్తే పది లీటర్ల బెల్లం చారు వస్తుంది. అలా వచ్చిన చారును పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచుతారు. ఈ బెల్లం చారును తాటి బెల్లంగా మార్చేందుకు మరోసారి మరిగిస్తారు. అప్పుడు బాగా చిక్కగా మారిన పాకాన్ని చల్లబరిచి అచ్చుల్లా పోస్తారు. ఇలా చేసిన 15 నిమిషాల్లో పాకం గడ్డకట్టి బెల్లంగా మారుతుంది.
కరోనా దెబ్బ