గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో మూడు రోజుల నుంచి జరుగుతున్న పరుచూరి రఘుబాబు 29వ జాతీయ నాటకోత్సవాలు ఘనంగా ముగిశాయి. కళా పరిషత్‌ల వల్లే నాటక రంగం నేటికి నిలబడిందని సినీ రచయిత, కళాపరిషత్ అధ్యక్షుడు పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాతో పాటు మరో రెండు పెద్ద సినిమాలకి మాటలు రాస్తున్నామని అన్నారు.నాటకాలకు రచయితల కొరత ఏర్పడిందని... సరైన రచనలు లభించినప్పుడే నాటకాలు రక్తి కట్టిస్తాయని నాటక రంగ నటుడు అమరేంద్ర అభిప్రాయపడ్డారు. నాటకాలు చూసేందుకు యువత ఎప్పుడైతే ఆసక్తి చూపిస్తారో అప్పుడే నాటక రంగం పురోగతి సాధిస్తుందని నాటక న్యాయ నిర్ణేత బీఎన్ రెడ్డి అన్నారు. అందుకు ప్రభుత్వం సహకారం అందించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ అన్నారు. రాబోయే రోజుల్లో శనివారాన్ని నాటక శనివారంగా పరిగణిస్తామన్నారు. నంది నాటకోత్సవాలు ఏర్పాటు చేసి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
యువతను ఆకర్షించినప్పుడే.. నాటకరంగం అభివృద్ధి - పరుచూరి గోపాల కృష్ణ
యువతను ఆకర్షించగలిగినప్పుడే నాటక రంగం అభివృద్ధి చెందుతుందని సినీ రచయిత, పరుచూరి కళాపరిషత్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా పల్లెకోనలో జరుగుతున్న 29 వ జాతీయ నాటకోత్సవాలు ఘనంగా ముగిశాయి.
యువతను ఆకర్షించినప్పుడే.. నాటకరంగం అభివృద్ధి