ఆందోళన వద్దు.. ఆక్సిజన్, రెమ్‌డిసివిర్ నిల్వలున్నాయి : కలెక్టర్ వివేక్ కొవిడ్ వ్యాప్తి కట్టడికి అన్ని చర్యలూ చేపడుతున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. జిల్లాలోని గుంటూరు నగరం, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని కలెక్టరేట్‌లో ఆయన వెల్లడించారు.
'ప్రతిరోజు సుమారు 9 వేల పరీక్షలు'
రోజూ సుమారు 9 వేల పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. వాటి ఫలితాలు 24 గంటల్లోనే వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆక్సిజన్, రెమ్‌డిసివిర్ తగినంతగా అందుబాటులో ఉన్నాయన్న కలెక్టర్.. ప్రజలు, వైద్యులు ఎవరూ నిల్వలపై ఆందోళన చెందనక్కర్లేదని భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి :ఎలక్షన్ కమిషన్‌లో పిటిషన్ వేసుకోండి: హైకోర్టు