రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 3వ శుక్రవారం ఉద్యోగులకు నిర్వహించే స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గుంటూరు కలెక్టర్ ఛాంబర్లో జరిగి ఈ కార్యక్రమానికి దరఖాస్తులు పోటెత్తాయి. ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలను కలెక్టర్కు వివరించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి... త్వరగా పరిష్కారం చూపుతామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు.
ఉద్యోగుల స్పందనకు విశేష ఆదరణ
గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై స్పందన కార్యక్రమం