ఇసుక కొరత గుంటూరు జిల్లాలో మరో కార్మికుడిని బలిగొంది. చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ నాగుల్‌మీరా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగుల్‌మీరా తాపీ మస్త్రిగా జీవనం సాగిస్తున్నాడు. ఇసుక కొరత కారణంగా నాలుగు నెలల నుంచి పనులు దొరకడం లేదు. తనవద్ద పనిచేసే వారికి ముందుగానే నాగుల్‌మీరా నగదు చెల్లించాడు. కానీ పనులు లేనందున ఆయనకు రావాల్సిన డబ్బులు రాలేదు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తి... ఈనెల 26న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాగుల్‌మీరా గురువారం మరణించాడు.
మరో తాపీమేస్త్రి ప్రాణం తీసిన ఇసుక - ఇసుక కొరతకు కార్మికుడి ఆత్మహత్య
ఇసుక కొరత కారణంగా మరో తాపీమేస్త్రి బలయ్యాడు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్లకు చెందిన నాగుల్‌మీరా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇసుక కొరతకు కార్మికుడి ఆత్మహత్య