ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడెల వద్దు... చంద్రబాబు ముద్దు ! - sattenapalli

సభాపతి కోడెల శివప్రసాద్​కు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో తెదేపా శ్రేణులు నిరసన గళం విప్పారు. ఆయనకు సీటు కేటాయించవద్దు అంటూ నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. కోడెల వద్దు... చంద్రబాబు ముద్దు అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు.

అసమ్మతిదారులు

By

Published : Mar 13, 2019, 5:11 PM IST

Updated : Mar 13, 2019, 5:51 PM IST

సత్తెనపల్లిలో ఆందోళన
గుంటూరు జిల్లా సత్తెనపల్లి సీటును సభాపతి కోడెల శివప్రసాదరావుకు కేటాయించొద్దంటూ బుధవారం అసమ్మతివాదులు గళం విప్పారు. సత్తెనపల్లిలోని తెదేపా కార్యాలయానికి అసమ్మతివాదులు అధిక సంఖ్యలో చేరుకుని కోడెల వద్దు... చంద్రబాబు ముద్దు అంటూ నినాదాలు చేశారు. సత్తెనపల్లిలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినాపార్టీ గెలుస్తుందని ఆ సంప్రదాయాన్ని చెప్పారు. ఆందోళన చేస్తున్న వారిని బుజ్జగించేందుకు మున్సిపల్ ఛైర్మన్ రామస్వామి, మార్కెట్ యార్డ్​ చైర్మన్ కరీముల్లా, పలువురు నాయకులు ప్రయత్నించినా... ఫలించలేదు.
Last Updated : Mar 13, 2019, 5:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details