ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GGH: జీజీహెచ్​లో శస్త్ర చికిత్సలు పునఃప్రారంభం

కరోనా కారణంగా గుంటూరు జీజీహెచ్​(GGH)లో కొన్నాళ్లుగా నిలిచిపోయిన శస్త్రచికిత్సలను మళ్లీ ప్రారంభించాలని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వైద్య సిబ్బందికి సూచించారు.

కొవిడ్​ ఎఫెక్ట్​తో జీజీహెచ్​లో నిలిచిపోయిన శస్త్ర చికిత్సలు పునఃప్రారంభం
కొవిడ్​ ఎఫెక్ట్​తో జీజీహెచ్​లో నిలిచిపోయిన శస్త్ర చికిత్సలు పునఃప్రారంభం

By

Published : Jun 14, 2021, 9:39 PM IST



కొవిడ్ వ్యాప్తితో జీజీహెచ్​లో కొన్నాళ్లుగా నిలిచిపోయిన శస్త్రచికిత్సలను మళ్లీ ప్రారంభించాలని గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వైద్యసిబ్బందికి సూచించారు. కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతుండటం, మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసుల తీవ్రత దృష్ట్యా ఆపరేషన్ థియేటర్లను సిద్ధంచేయాలని ఆదేశించారు. నాన్ కోవిడ్ కేసులకు సంబంధించి శస్త్రచికిత్సల నిర్వహణకు ఎముకల వార్డులోని ఆపరేషన్ థియేటర్​ను సిద్ధంచేయాల్సిందిగా తెలిపారు. ఆర్ధోపెడిక్, న్యూరోసర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, క్యాన్సర్ కేసులకు ఈ థియేటర్లో శస్త్రచికిత్సలు చేస్తారని డాక్టర్ ప్రభావతి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details