గుంటూరు అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా శుక్రవారం 37 మంది బాలబాలికలకు పోలీస్ సిబ్బంది రక్షణ కల్పించారు. వీరిని సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి గుంటూరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ సుగుణాల రాణి వద్ద వీడియో కాన్ఫరెన్స్లో హాజరుపరిచారు. అనంతరం వారిని విచారించి 24 మంది బాలురను, 12 మంది బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు అర్బన్ పోలీసులు తెలిపారు. ఒక బాలికను సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ ఉత్తర్వులు మేరకు చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ పరిధిలోని హార్వెస్ట్ ఇండియా రెస్క్యూ హోం నందు అప్పగించడం జరిగిందని వివరించారు.
ఆపరేషన్ ముస్కాన్: 37 మంది బాలబాలికలకు రక్షణ - operation muskan latest news
ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా గుంటూరు అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు 37 మంది బాలబాలికలకు పోలీసు సిబ్బంది రక్షణ కల్పించారు. వీరిని గుంటూరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ సుగుణాల రాణి వద్ద వీడియో కాన్ఫరెన్స్లో హాజరుపరిచారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
గుంటూరు అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు 37 మంది బాలబాలికలకు పోలీసు సిబ్బంది రక్షణ