గుంటూరు జిల్లా దాచేపల్లిలో తెదేపా కార్యాలయాన్ని ఆ పార్టీ నేత యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో మరణించిన తెదేపా కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల ఆశీస్సులతో పార్టీ కార్యాలయం ప్రారంభించామన్నారు. వైకాపా ప్రభుత్వం పెట్టిన పథకాలు అన్ని వైకాపా కార్యకర్తలకే తప్ప ఎవరికి ఇవ్వడం లేదని మండిపడ్డారు. అప్పులు తెచ్చి పథకాల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని... ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపా ఓడిపోవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
TDP: దాచేపల్లిలో తెదేపా కార్యాలయం ప్రారంభం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా దాచేపల్లిలోని తెదేపా కార్యాలయాన్ని ఆ పార్టీ నేత యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య కాలంలో మరణించిన తెదేపా కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దాచేపల్లిలో తెదేపా కార్యాలయం ప్రారంభం