లాక్డౌన్ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మొక్కజొన్న, జొన్న, అపరాల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఆయన.. రైతులందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెనాలిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం - tenali market
రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధన అమలవుతున్న నేపథ్యంలో రైతులు పంటలను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెనాలి ఎమ్మెల్యే పేర్కొన్నారు.
![తెనాలిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం Opening of Corn Purchase Center in Tenali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6771611-1043-6771611-1586758246075.jpg)
తెనాలిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం