కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు. అయిన అమరావతి రైతులు మాత్రం తమ దీక్షను కొనసాగిస్తున్నారు.అయితే నలుగురు కంటే ఎక్కువమంది దీక్షాశిబిరంలో ఉండకూడదని ఆదేశాలు జారీచేశారు. అలా ఉండే నలుగురు కూడా 50 సంవత్సరాలలోపు వయసు వారే ఉండాలని తెలిపారు. తప్పనిసరిగా మాస్క్ లేదా కర్చీఫ్ కట్టుకుని ప్రతి గంటకి శానిటేషన్ నిర్వహించుకుంటూ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని నిర్ణయించారు. శిబిరాలలో మైక్‌లు, జన సమూహం లేకుండా చూసుకోవాలని సూచించారు. మిగిలిన వారు వారి వారి ఇళ్లల్లో దీక్ష చేస్తూ ఫోటోలు వీడియోలు తీసి పంపించాలని నిర్ణయించారు.
కరోనా ఎఫెక్ట్: దీక్షాశిబిరంలో ఆ వయసు వాళ్లు మాత్రమే ఉండాలట! - only 4 memebers in diskha place in amaravathi moment
అమరావతి ప్రాంతంలో రైతుల దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రం మొత్తం షట్‌డౌన్ ప్రకటించింది. దీక్ష శిబిరాల్లో నలుగురు కంటే ఎక్కువ మంది ఎట్టి పరిస్థితులలో శిబిరంలో ఉండవద్దన్నారు.
అమరావతి కోసం దీక్ష చేస్తున్న రైతులు