ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్​లైన్​​ వ్యభిచార ముఠా గుట్టు రట్టు... ఐదుగురు అరెస్ట్ - ఆన్ లైన్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు

అతనో గోల్డ్ మెడల్ విద్యార్థి. చెడు అలవాట్లకు బానిసై పక్కదారిపట్టాడు. జల్సాల కోసం సులభంగా డబ్బులు సంపాదించాలని ఆన్​లైన్ వ్యభిచార మార్గాన్ని ఎంచుకున్నాడు. తనకు ఉన్న మేధస్సుతో  ఓ వెబ్​సైట్ తెరిచాడు. అందులో అందమైన అమ్మాయిల ఫొటోలు, ఫోన్ నంబర్​లను ఉంచి... గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పోలీసులకు అందిన సమాచారంతో... నిఘాపెట్టి... నిందితులను పట్టుకున్నారు.

online prosecution team was arrested in nandivelugu of guntur district
ఆన్​లైన్​ వ్యభిచార ముఠా అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న గుంటూరు తూర్పు డీఎస్పీ సుప్రజ

By

Published : Jan 4, 2020, 7:26 AM IST

ఆన్​లైన్​ వ్యభిచార ముఠా అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న గుంటూరు తూర్పు డీఎస్పీ సుప్రజ

గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన వీర బ్రహ్మం తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అమ్మమ్మ దగ్గర పెరిగాడు. ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్న బ్రహ్మం...చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. గుంటూరులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాతో సంబంధం పెట్టుకున్నాడు. దీని ద్వారా అధిక మొత్తంలో నగదు వస్తోందనే ఆశతో... తానే స్వయంగా ఓ వెబ్​సైట్ తయారు చేశాడు. తనతో పాటు మరొక యువకుడిని భాగస్వామిగా చేసుకున్నాడు. ఈ వెబ్​సైట్​లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టాడు. వెబ్​సైట్​లో ఫోన్ నంబర్లు పెట్టి కాల్ చేసిన వారికి యువతిలతో పరిచయాలు ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహించేవారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

వీరబ్రహ్మం ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి వ్యభిచారం కూపిలోకి దించాడు. కొరిటీపాడులో కొన్ని రోజులు, పాత గుంటూరు- నందివెలుగు రోడ్డులో మరికొన్ని రోజులు వ్యభిచారానికి తెరలేపాడు. నిందితులు వీర బ్రహ్మం, ఉప్పల థామస్​తో సహా ఇద్దరు విటులు భూపతి నాగేశ్వరరావు, అశోక్ కుమార్, యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గుంటూరు తూర్పు డీఎస్పీ కె.సుప్రజ తెలిపారు.

దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహించాల్సిన యువత...నేడు చెడు వ్యసనాలకి బానిసలై తమ ఉజ్వల భవిష్యత్​ను నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: మెడికోలను వేధిస్తున్న సైకో డాక్టర్​కు సంకెళ్లు..!

ABOUT THE AUTHOR

...view details