ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైక్రోఫైనాన్స్‌ నిర్వాహకులు వేధింపులు.. ఎస్పీకి ఫిర్యాదు - మైక్రోఫైనాన్స్‌ నిర్వాహకులు వేధిస్తున్నారంటూ ఎస్పీకి బాధితుల ఫిర్యాదు

గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు.. మైక్రోఫైనాన్స్‌ నిర్వాహకులు వేధిస్తున్న తీరుపై ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. కాల్​మనీ కేటుగాళ్ల నుంచి తమను కాపాడాలని బాధితులు ఎస్పీని కోరారు.

online loans harrasment to people in guntur
మైక్రోఫైనాన్స్‌ నిర్వాహకులు వేధింపులు.. ఎస్పీకి ఫిర్యాదు

By

Published : Dec 23, 2020, 10:34 PM IST

రాష్ట్రవ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్‌ వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు.. మైక్రోఫైనాన్స్‌ నిర్వాహకులు వేధిస్తున్న తీరుపై ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో రూ.5 వేలు అప్పు తీసుకుంటే.. దాన్ని చెల్లించేందుకు ఇంకో రెండు యాప్స్‌లో అప్పు తీసుకునే పరిస్థితి కల్పిస్తున్నారని బాధితులు గోడు వెళ్లబుచ్చుకున్నారు. కాల్​మనీ కేటుగాళ్ల నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు.

తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోతే ఫోన్​లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ.. మీ స్నేహతుడు దొంగ, మోసగాళ్లు అని మెసేజ్​లు పెడుతున్నారని బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.

ఇదీ చదవండి:

ఈ నెల 29న రైతులకు తుపాను పరిహారాన్ని అందిస్తాం: కన్నబాబు

ABOUT THE AUTHOR

...view details