గుంటూరు జిల్లాలో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. బీమా సొమ్ము ఇస్తామని చెప్పి ఓ మహిళను మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరు జిల్లా పట్టాభిపురం జార్జిపేటకు చెందిన వీణారాణి కుమారుడు పదినెలల క్రితం మృతి చెందాడు. అతడి పేరుమీద బీమా పాలసీలు ఉండటంతో.. ఆమె వివరాలను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. బీమా డబ్బులు మంజూరయ్యాయని, సెక్యూరిటీగా కొటాక్ మహీంద్ర బ్యాంకులో ఖాతా తెరిచి అందులో రూ. 8 లక్షలు డిపాజిట్ చేయాలని నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన వీణారాణి రూ. 8 లక్షలను వారు ఇచ్చి మూడు ఖాతాల్లో బదిలీ చేసింది.
బీమా సొమ్ము పేరుతో ఆన్లైన్ మోసం...రూ.8 లక్షల స్వాహా - బీమా సొమ్ము పేరుతో ఆన్లైన్ మోసం తాజా వార్తలు
బీమా సొమ్ము ఇస్తామని చెప్పి ఆన్లైన్ కేటుగాళ్లు ఓ మహిళను మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లా జార్జిపేటలో జరిగింది. తనకు రావాల్సిన బీమా సొమ్ము ఇస్తామని చెప్పి మహిళ నుంచి రూ. 8 లక్షలు స్వాహా చేశారు.
బీమా సొమ్ము పేరుతో ఆన్లైన్ మోసం
డబ్బు జమ చేసి నెలలు గడుస్తున్నా..బీమా సొమ్ము తిరిగి రాకపోగా మరో రూ. 3 లక్షలు ఇవ్వాలని ఒత్తడి చేస్తుండటంతో బాధితురాలు మోసపోయానని గ్రహించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని అరుండల్పేట పోలీసులు వెల్లడించారు.
ఇదీచదవండి: ఇసుక అక్రమార్కులకు 22.50 కోట్ల జరిమానా