కరోనా నేపథ్యంలో విద్యార్థులకు నేరుగా తరగతులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన్ విద్యా సంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య తెలిపారు. గుంటూరు జిల్లా వడ్డమూడిలోని యూనివర్శిటి ప్రాంగణంలో ఆన్ లైన్ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రత్తయ్య... తమ విశ్వవిద్యాలయంలో చదువుతో పాటు శారీరక ధృడత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.
అందుకే క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు. శారీరకంగా మంచి ఆరోగ్యంతో ఉన్నవారు కరోనా వంటి వైరస్ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. అంతర్జాతీయంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ బోధనా పద్ధతులు మార్చుకుంటూ అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తరగతి గదిలోనే 70 శాతం నేర్చుకోవటం పూర్తి కావాలని విద్యార్థులకు సూచించారు.