గుంటూరు రైతు బజార్లో అధికారులు రాయితీ ధరకు ఉల్లిని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 26 మెట్రిక్ టన్నుల ఉల్లిని దిగుమతి చేశారు. ఒక్కొక్కరికి కిలో రూ.40 చొప్పున రెండు కిలోలు అందజేస్తున్నారు. గత నెల 23 నుంచి రాయితీ ధరకు ఉల్లి విక్రయాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. దిగుమతి చేసుకున్న ఉల్లిని జిలాల్లోని పలు రైతు బజార్లకు సరఫరా చేస్తామన్నారు. తక్కువ ధరకు ఉల్లి అందుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లి రాయితీ.. ఒక్కొక్కరికి కిలో రూ.40 - ఉల్లి దిగుమతి
ఉల్లి ధరలు పెరిగిపోయాయి. దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టిన విషయం విధితమే. ప్రజల అవసరం తీర్చేందుకు రైతు బజారుల్లో ఒక్కొక్కరికి కిలో రూ.40కి అందజేస్తోంది.

ఉల్లి రాయితీ ఒక్కొక్కరికి కిలో రూ.40 చొప్పున రెండు కిలోలు