పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం లక్షా 51వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు పులిచింతల అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి 9 గేట్లు ఎత్తి లక్షా 21వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నిన్నటితో పోలిస్తే వరద తీవ్రత కొంత తగ్గినా రేపటి వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 33.49 టీఎంసీలు నిల్వ ఉంది. నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్న దృష్ట్యా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
pulichinthala project: పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద - గుంటూరు జిల్లా తాాజా వార్తలు
పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం లక్షా 51వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు పులిచింతల అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి 9 గేట్లు ఎత్తి లక్షా 21వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద