ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. 323 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి

గుంటూరు జిల్లాలో కొవిడ్ వైరస్ ఉద్ధృతి తగ్గినప్పటికీ.. వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా జిల్లాలో 323 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 69వేల 540కు చేరాయి.

By

Published : Nov 4, 2020, 10:47 PM IST

కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. 323 పాజిటివ్ కేసులు.. ఇద్దరి మృతి
కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. 323 పాజిటివ్ కేసులు.. ఇద్దరి మృతి

గుంటూరు జిల్లాలో కొత్తగా 323 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. తాజాగా గుంటూరు నగర పరిధిలో అత్యధికంగా 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాడేపల్లిలో 20, నరసరావుపేటలో 19, కొల్లిపరలో 13, మాచర్లలో 12, అమర్తలూరులో 11, సత్తెనపల్లిలో 10 కేసుల చొప్పున నమోదయ్యాయి.

గుంటూరు రెండో స్థానంలో..

గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 64 వేల 589 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో జిల్లాలో ఇద్దరు మరణించారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 627కి చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అధిక మరణాలు సంభవిస్తోన్న జిల్లాల్లో చిత్తూరు తర్వాత గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇవీ చూడండి : గ్రామం రూపురేఖలు మార్చేందుకు కవిత ఆరాటం

ABOUT THE AUTHOR

...view details