గుంటూరు జిల్లాలో కోవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 117 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 72వేల 178కు చేరింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నుంచి 37 కేసులు నమోదయ్యాయి.
తెనాలి నుంచి 15 కేసులు, తాడేపల్లిలో 13 కేసులు, ఫిరంగిపురంలో 10 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 645కి పెరిగింది. అత్యధికంగా మృతి చెందిన వారి సంఖ్యలో జిల్లా రెండో స్థానంలో ఉంది.