గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దుగ్గిరాల నుంచి చింతలపూడి వెళ్లే రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతురాలు కటివరానికి చెందిన రత్నకుమారిగా గుర్తించారు. కూలీ పనుల కోసం ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కూలీలతో వెళ్తున్న ఆటోకు ప్రమాదం... ఒకరు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు - guntur district road accident news
వారంతా కూలీలు. ఎప్పటిలాగే పొట్టకూటి కోసం కూలీ పనికి బయలుదేరారు. విధి వక్రీకరించి వారు వెళ్తున్న ఆటోకు ప్రమాదం జరిగింది. వారిలో ఒకరిని మృత్యువు కబళించగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అంతసేపు వారితో గడిపిన వారిలో ఒకరు ప్రాణాలతో లేరనే నిజం వారిని శోకసంధ్రంలోకి నెట్టింది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
రోడ్డు ప్రమాదం