ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొల్లిపర మండల పరిధిలోని పలు గ్రామాల్లో లాక్​డౌన్​ - గుంటూరు జిల్లా వార్తలు

గత కొంత కాలంగా కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో లాక్​డౌన్​ విధించారు. వ్యాపార సమయాలపై ఆంక్షలు విధించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

lock down in kollipara mandal
కొల్లిపర మండల పరిధిలోని గ్రామాల్లో వారం పాటు లాక్​ డౌన్​

By

Published : Apr 9, 2021, 5:22 PM IST

Updated : Apr 9, 2021, 8:21 PM IST

అధికారుల ఆదేశాలతో ఖాళీగా రహదారులు

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో వారం రోజుల పాటు లాక్​డౌన్​ ఆంక్షలు విధిస్తూ తహసీల్దార్ నాంచారయ్య ఆదేశాలు జారీ చేశారు. మండలంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 10వ తేదీ నుండి 16 వరకు కొల్లిపర, తూములూరు, దావులూరు అడ్డరోడ్డు గ్రామాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

కరోనా హెచ్చరికలతో మూసివేసిన దుకాణాలు

అత్యవసర సర్వీసులు మినహా.. మిగిలిన అన్ని వ్యాపార కార్యకలాపాలు ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు. టీ, టిఫిన్ సెంటర్లు, హోటళ్లను వారం రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలిచ్చారు.

సందుల్లో నెలకొన్న నిశ్శబ్ధం
Last Updated : Apr 9, 2021, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details