ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాట్లాడేందుకు ఫోన్ ఇవ్వలేదని.. గొంతు నులిమి చంపేశాడు! - chebrol crime news

మాట్లాడేందుకు ఫోన్ ఇవ్వలేదని ఓ వ్యక్తి తన స్నేహితుడినే.. గొంతు నులిమి చంపేశాడు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలులో జరిగింది.

murder
murder

By

Published : Jun 9, 2021, 10:40 AM IST

గుంటూరు జిల్లా చేబ్రోలులో దారుణం జరిగింది. మాట్లాడేందుకు ఫోన్ ఇవ్వలేదని కోపంతో.. ఓ వ్యక్తి మద్యం మత్తులో స్నేహితుడిని గొంతునులిమి చంపేశాడు. షేక్ షఫీవుల్లా అనే యువకుడు తాపీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అదే ప్రాంతానికి చెందిన అతని మిత్రుడు అలీఖాన్ కారు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు.

ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అలీఖాన్.. షఫీవుల్లాను చరవాణి అడగ్గా ఇవ్వకపోవడంపై ఆగ్రహించాడు. గొంతు నులిమి కింద పడేశాడు. అదే క్రమంలో.. షఫీవుల్లా మరణించాడు. కొద్దిసేపటికి స్థానికులు గమనించి మృతి చెందినట్లుగా గుర్తించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details