రోడ్డు ప్రమాదం: గేదె అడ్డొచ్చి అదుపుతప్పిన వాహనం.. వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాద వార్తలు
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు స్నేహితులు విజయవాడ నుంచి ప్రకాశం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
![రోడ్డు ప్రమాదం: గేదె అడ్డొచ్చి అదుపుతప్పిన వాహనం.. వ్యక్తి మృతి One person died in road accident in Guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7566968-689-7566968-1591850094242.jpg)
రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన ఆవుల పవన్ కుమార్, చింతల విజయకాంత్ ద్విచక్రవాహనంపై విజయవాడ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. అకస్మాత్తుగా గేదె రోడ్డుకు అడ్డంగా వచ్చేసరికి వాహనం అదుపు తప్పి.. రోడ్డుపై పడిపోయారు. ఇద్దరికీ గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా పవన్ కుమార్ మృతి చెందాడు. విజయకాంత్ చికిత్స పొందుతున్నాడు.