గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని నందివెలుగు చెక్ పోస్ట్ వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఎరుకలపూడి గ్రామానికి చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళగిరి నుంచి ఎరుకలపూడి గ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి - guntur district road accident news
గుంటూరు జిల్లా నంది వెలుగు వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి