ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక కొరతతో మరో భవన కార్మికుడు ఆత్మహత్య - one person suicide due to sand shortage

ఇసుక కొరత సమస్య మరో భవన నిర్మాణ కార్మికుడి ఉసురు తీసింది. నాలుగు నెలలుగా పనుల్లేక కుటుంబాన్ని పోషించలేక మానసిక ఒత్తిడితో గుంటూరు జిల్లా భర్తిపూడి గ్రామంలో రమేష్​ అనే కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మరో ప్రాణం ఇసుక కొరతకు బలి...

By

Published : Nov 5, 2019, 12:20 PM IST

ఇసుక కొరత.. తీసింది మరో కార్మికుడి ప్రాణం
గుంటూరు జిల్లా బాపట్ల మండలం భర్తిపూడి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు నలికుర్తి రమేష్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత నాలుగు నెలలుగా పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బంధువులు తెలిపారు. కుటుంబాన్ని పోషించటం భారంగా మారి.. మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు వివరించారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details