ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంచి చేద్దామని మధ్యలో వెళ్లినందుకు.. చేతిని నరికేశారు! - హాఫ్​పేట వార్తలు

గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారు అన్నందుకే... ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తిపై కత్తితో దాడికి దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిమండలం హాఫ్​పేటలో జరిగింది.

one person attacked by two persons at halfpeta
హాఫ్​పేటలో వ్యక్తిపై దాడి

By

Published : Jul 19, 2021, 10:42 AM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని హాఫ్​పేట గ్రామంలో ఇద్దరు వ్యక్తులు.. మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. సురేష్, ముసలయ్య అనే వ్యక్తుల బంధువులకు సంబంధించిన కర్మకాండ కార్యక్రమంలో.. ఇద్దరికి వాగ్వాదం జరిగింది. అదే సమయంలో నాగరాజు అక్కడికి వెళ్లాడు. గొడవకు గల కారణం ఏంటని ప్రశ్నించాడు.

సురేష్, ముసలయ్య అతనిపై తీవ్రంగా స్పందించారు. నీకు ఏం సంబంధం అని అతని పైకి వచ్చారు. గొడవ పెద్దదై.. తోపులాట జరిగింది. అనంతరం సురేష్, ముసలయ్య నాగరాజు పై కత్తితో దాడి చేశారు. దాడిలో నాగరాజు అరచేయి తెగింది. దీంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే.. తనపై దాడి చేశారని బాధితుడు నాగరాజు ఆవేదన చెందాడు.

ABOUT THE AUTHOR

...view details